Rangareddy: యాభై ఏళ్ళు పైబడ్డాయి. మిగిలిన ఈ కొన్ని రోజులు ఎదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి అని ఆ వృద్ధ దంపతులు అనుకున్నారు. నీకు నేను నాకు నువ్వు తోడుగా …ఇన్ని సంవత్సరాలు కలిసి బ్రతికాం..అనుకుంటూ ఉండగానే..వారి జీవితాల్లో అంతులేని విషాదం. చంపేశారు. నిద్రిస్తున్న ఆ ఇద్దరినీ అత్యంత దారుణంగా చంపేశారు. ఇంతకి వీరిని చంపడానికి కారణం ఏమిటి ? ఈ ఏజ్ లో ఆనందంగా కాలం గడుపుతున్న వారి జీవితను ఛిద్రం చేసిన ఆ నీచులు ఎవరు ?
రంగారెడ్డి జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా ముష్టి పెళ్లికి చెందిన ఉషయ్య,శాంతమ్మగా గుర్తించారు.
మృతదేహాలు ఒక్కొక్కటి ఒక దగ్గర పడి ఉన్నాయి. శాంతమ్మ మృతదేహం గదిలో ఉండగా..భర్త మృతదేహం బయట పడి ఉంది. వీళ్లు ఫామ్ హౌస్ లో వాచ్ మెన్ గా చేస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

