AUS vs AFG

AUS vs AFG: నేడే ఆస్ట్రేలియా-ఆఫ్గనిస్తాన్ మధ్య నిర్ణయాత్మక పోరు..! సెమీఫైనల్ చేరేది ఎవరో…?

AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆఫ్ఘన్ జట్టు, తమ సెమీఫైనల్‌కు చేరుకునే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పుడు లీగ్ దశలో సెమీఫైనల్‌కు అర్హత సాధించడానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఇంగ్లాండ్‌ను ఇంటి ముఖం పట్టించిన ఆఫ్ఘన్ జట్టు, మరో సంచలన విజయంతో ముందుకు సాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ మ్యాచ్ డూ-ఆర్-డై మ్యాచ్‌గా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఆస్ట్రేలియా గెలిస్తే, వారు సెమీఫైనల్‌కు చేరుకుంటారు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రికార్డు సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్ ఐదు వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్జాయ్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు, రెండుసార్లు ఈ ట్రోఫీ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

AUS vs AFG: ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్, అంతకు ముందు దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోరాడడం ఆస్ట్రేలియా జట్టుకు క్వార్టర్ ఫైనల్‌గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టును తేలికగా తీసుకుంటే, ఆస్ట్రేలియా తప్పకుండా భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.

వన్డే క్రికెట్‌లో ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 4 వన్డేల్లో ఎదురెదురు కాగా, ఈ నాలుగు మ్యాచ్‌లలోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తన తొలి విజయం కోసం ప్రయత్నిస్తోంది. 2023 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. మాక్స్వెల్ అద్భుతమైన డబ్బులు సెంచరీ తో ఆస్ట్రేలియాను ఓటమి కోరల నుండి బయట పడేసాడు.

Also Read:  IND vs PAK: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..! మళ్ళీ భారత్-పాక్ సమరం

AUS vs AFG: ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, రెండు జట్లలో ఏదైనా గెలిచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత, ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం అంత సులభం కాదు. ఆస్ట్రేలియా గతంలో పైచేయి సాధించినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయడం సరైనది కాదు. అంతేకాకుండా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్..? ఆస్ట్రేలియా ను అనూహ్యంగా ఓడించి టోర్నమెంట్ నుండి బయటకు పంపించింది. కాబట్టి వీరిద్దరి మధ్య మాత్రం ఒక రకమైన యుద్ధమే జరుగుతుంది అని చెప్పవచ్చు.

ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఉపయోగించే పిచ్ బ్యాటర్‌లకు అనుకూలంగా ఉంటుంది, అంటే ఈ మ్యాచ్‌లో అధిక స్కోర్‌లు రావడానికి అవకాశం ఉంది. లాహోర్‌లో సాధారణంగా బ్యాటింగ్ ట్రాక్‌లు ఉంటాయి, మిడిల్ ఓవర్‌ల్లో స్పిన్నర్‌లు కీలక పాత్ర పోషించగలరు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.

వాతావరణ పరిస్థితులను గమనిస్తే, పగటి సమయంలో వర్షం పడే అవకాశం ఉంది, కానీ మ్యాచ్ ప్రారంభ సమయానికి వాతావరణం స్పష్టంగా ఉంటుంది. రావల్పిండి వలె ఇక్కడ అధిక వర్షాలు కురిసే అవకాశం లేదు. రెండు జట్ల మధ్య పూర్తి స్థాయి పోటీ జరగనుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *