రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఫాం హౌస్ లో భార్య భర్తల సేవలై కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న ఫాంహౌస్ లో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఫాం హౌస్ వద్ద ఉన్న డెడ్ బాడి లను చూసిన స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా ముష్టిపెళ్లికి చెందిన ఉషయ్య (55), శాంతమ్మ (50)లుగా గుర్తించారు. వృద్ధ దంపతులు కొన్ని రోజులుగా ఫాంహౌస్ లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి.. దారుణంగా హతమార్చారని పోలీసులు తెలిపారు.