Gold Card Visa

Gold Card Visa: ట్రంప్ కీలక ప్రకటన – EB-5 స్థానంలో ‘గోల్డ్ కార్డ్’ వీసా

Gold Card Visa: అమెరికా వలస విధానంలో మరో కీలక మార్పుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 35 ఏళ్లుగా అమలులో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా విధానాన్ని రద్దు చేసి, ‘గోల్డ్ కార్డ్’ వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త వీసా విధానం ద్వారా, అమెరికాలో కనీసం 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే వారికి పౌరసత్వం పొందే మార్గం సులభతరం కానుంది.

ట్రంప్ ప్రకటనలో కీలకాంశాలు:
ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ‘‘ఈ వీసా పొందే వారు అమెరికాలో మరింత ధనవంతులవుతారు, విజయాలను సాధిస్తారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించి, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలుచేసే విధానం’’ అని పేర్కొన్నారు.

EB-5 స్థానంలో ‘గోల్డ్ కార్డ్’ వీసా:
వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ ప్రకారం, రెండు వారాల్లో EB-5 వీసాలను ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’ వీసాలతో భర్తీ చేయనున్నారు. ఇది గ్రీన్ కార్డ్‌కు సమానమైన శాశ్వత నివాస హోదాను కల్పించే విధానం. గతంలో EB-5 వీసాల ద్వారా భారీ స్థాయిలో మోసాలు జరిగినట్లు అధ్యయనంలో తేలడంతో, చట్టబద్ధమైన ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు ‘గోల్డ్ కార్డ్’ వీసా ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

Also Read: Marry or Get Fired: ఇదేం కంపెనీ రా బాబు..పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలా..

ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ వీసా విధానం:
ప్రస్తుతం యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ‘గోల్డెన్ వీసా’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా అదే మార్గాన్ని అనుసరించనుంది. అయితే, EB-5 వీసాల జారీపై పరిమితి ఉండగా, ‘గోల్డ్ కార్డ్’ వీసాలకు ఎటువంటి పరిమితులు ఉండవని ట్రంప్ తెలిపారు.

విపరీతంగా ‘గోల్డ్ కార్డ్’ జారీ – ద్రవ్యలోటు తగ్గించేందుకు నిర్ణయం
అమెరికా ఆర్థిక లోటును తగ్గించేందుకు, కొటి ‘గోల్డ్ కార్డ్’ వీసాలను జారీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త వీసా విధానం వలసదారులపై, అమెరికా పెట్టుబడి మార్కెట్‌పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *