Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ. 1871 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అల్లు అర్జున్‌కు తిరుగు లేని విజయాన్ని అందించింది.త్రివిక్రమ్ తో సినిమా చేసే ముందు అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట బన్నీ. ఉగాది రోజున ఈ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. బన్నీతో సినిమా కోసం అట్లీ టీమ్ రెడీ అవుతుందట. ఈ సినిమా కోసం ఇప్పటీకే మ్యూజిక్ డైరెక్టర్ ను కూడాఫిక్స్ చేసాడట అట్లీ. తమిళ లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించబోతున్నాడని చెన్నై వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఆల్మోస్ట్ జాన్వీ ఫిక్స్ చేసేసారని సమాచారం. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
