Young Doctor Missing: కర్ణాటక రాష్ట్రంలో విహారయాత్ర కోసం వెళ్లిన హైదరాబాద్ నగర స్నేహితులకు విషాదం అలుముకున్నది. వారిలో ఒకరు నదిలో గల్లంతు కావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటివరకూ ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించలేదు. అక్కడి సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంకు సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది.
Young Doctor Missing: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న మైనంపల్లి అనన్యరావు (26) తన ముగ్గురు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం సణాపురంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. నిన్న ఉదయం బుధవారం (ఫిబ్రవరి 19) తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు. ఓ పెద్ద రాయిపై నుంచి అనన్య నదిలోకి దూకారు. కాసేపు ఈతకొట్టిన ఆమె.. నీటి ఉధ్రుతి కారణంగా కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
Young Doctor Missing: నదిలో దూకుతుండగా, ఈత కొడుతుండగా అనన్యరావు స్నేహితులు తీసిన వీడియో వైరల్ అవుతున్నది. వన్..టూ..త్రీ.. అంటూ స్నేహితులు కౌంట్‌డౌన్ చెప్పిన మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అప్రమత్తమైన స్నేహితులు.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. డాక్టర్ అనన్యరావు నగరంలోని ఓ ప్రముఖ డాక్టర్ కూతురుగా తెలుస్తున్నది.
Young Doctor Missing: డాక్టర్ అనన్య గల్లంతైన తుంగభద్ర నది చోటు రాతి గుహల్లో ఉన్నది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె ఎక్కడో ఓ చోట రాతి గుహల్లో చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానిక గజ ఈతగాళ్లతోపాటు అగ్నిమాపక దళం ఘటన జరిగిన రోజు సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరనున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రోజు (గురువారం) నదిలో గాలింపు చర్యలు చేపట్టగా డాక్టర్ అనన్యరావు మృతదేహాన్ని వెలికి తీసినట్టు సమాచారం.