AP News

AP News: హాస్టల్ నుంచి మాయం అయిన విద్యార్థినిలు..సంచలనం సృష్టిస్తున్న ఘటన.!

AP News: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో ఐదుగురు విద్యార్థినిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఈ విద్యార్థినిలు విజయవాడలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినిల అదృశ్యం ఘటనలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల దండన, టీచర్ల మందలింపు, చదువుపై ఆసక్తి లేకపోవడం, ప్రేమ విఫలమవడం వంటి వివిధ కారణాలతో యువతులు ఇళ్లు, హాస్టళ్ల నుంచి ఊహించని విధంగా వెళ్లిపోతున్నారు.

కొంతమంది విద్యార్థినిలు విహారయాత్రలు లేదా ఇతర కార్యక్రమాల పేరుతో అనుమతి లేకుండా వెళ్లిపోవడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశేషంగా, కొంతమంది అమ్మాయిలు దక్షిణ కొరియా పాప్ బృందం బీటీఎస్ ను కలిసేందుకు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో, విద్యార్థినిలు ఆకస్మికంగా అదృశ్యమవడం కుటుంబ సభ్యులు, పోలీసులను కంగారు పెట్టుతోంది.

ఇది కూడా చదవండి: Delhi High Court: యువతకు ప్రేమించే స్వచ్ఛ ఉండాలి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ముస్తాబాద్‌కు చెందిన ఈ విద్యార్థినిలు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే, వారు కాలేజీ హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా వెళ్లిపోయారు. వారి స్నేహితులు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో ఈ విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలియజేశారు. వెంటనే కాలేజీ యాజమాన్యం చుట్టుపక్కల వెతికినా విద్యార్థినిల ఆచూకీ లభించలేదు. దాంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యార్థినిలు హైదరాబాద్ వైపు ప్రయాణించి ఉండొచ్చని అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పలు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి, వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *