Priya Banerjee: టాలీవుడ్ లో పలు సినిమాల్లో తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ప్రియా బెనర్జీ. సందీప్ కిషన్ `జోరు చిత్రంలో నటించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనతో పాటు ప్రియా బెనర్జీ గ్లామరస్ పాత్రలో ఆకట్టుకుంటుంది. ప్రియా బెనర్జీ 2013లో `కిస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.
అడివి శేష్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. కృష్ణ విజయ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన అసుర చిత్రంలో కూడా నటించింది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.
Also Read: Banana: ఈ వ్యాధి ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు!
ఇప్పుడు ఈ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్ నటుడిని పెళ్లాడింది.యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్, ప్రియా బెనర్జీతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ప్రేమికుల రోజున వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.