Interstellar: సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అందులో భాగంగా హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లార్ కు వచ్చిన రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రదర్శించబడింది.
ఈ థియేటర్ మన తెలుగు సినిమాలకు, బిగ్ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు హబ్‌గా నిలుస్తోంది. అయితే, ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ రీ-రిలీజ్ లో ఓ అన్‌బ్రేకబుల్ రికార్డు క్రియేట్ చేసింది ఇంటర్‌స్టెల్లార్.ఈ సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మొత్తం 50 షోలకు ప్లాన్ చేశారు.
Also Read: Viral News: బీర్ టిన్లపై గాంధీజీ బొమ్మ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
కానీ ఆశించిన దానికంటే రెస్పాన్స్ విపరీతంగా రావడంతో 99.9% ఆక్యుపెన్సీతో అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఏకంగా 25,242 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రీ రిలీజ్ లో ఈ సినిమా ₹74,46,390 రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ విధంగా తెలుగుళ్ళు హాలీవుడ్ సినిమాతో రికార్డులు సృష్టించారు.
Interstellar – Trailer – Official Warner Bros