Business Idia: వ్యాపారం చేయాలంటే కోట్లాది రూపాయల పెట్టుబడులు అక్కర్లేదు. అవకాశాన్ని డబ్బుగా మార్చుకునే తెలివితేటలూ.. సమయస్ఫూర్తి ఉంటే చాలు. అప్పుడెప్పుడో ఛాలెంజ్ సినిమాలో పది పైసలతో లక్షలు సంపాదించిన యువకుడి కథ చూసి ఇలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాం. తరచూ ఇలాంటి కథలు కూడా చాలా వింటూ ఉంటాం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా చిన్నతనంలో కష్టపడ్డవాళ్లే అనే నిజాన్ని మనం గమనించలేం. చిన్న అవకాశం నుంచి కూడా రూపాయలు ఎలా సంపాదించాలనే తపనే వారిని ఈరోజు పెద్ద బిజినెస్ మెన్ గా మన ముందు నిలబెట్టింది. ఇదంతా ఎందుకంటే, మహా కుంభమేళా.. అక్కడి స్థానికులకు కొంచెం ఇబ్బందులు కలిగించినా.. చిన్న చిన్న పనులు చేసుకోవడం ద్వారా వేలాది రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని ఇచ్చింది. ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి రోజుకు ఐదువేలు సంపాదిస్తున్న కథనం విన్నాం. ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు సినిమాల్లో నటించే అవకాశం పొందిందని వైరల్ విషయాలు చూశాం. ఇప్పుడు అలా ఇదిగో ఈ టాప్ బిజినెస్ మేన్ ని పరిచయం చేసుకుందాం.
Business Idia: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళా జరుగుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఈ పరిస్థితిలో, 12 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ప్రతిరోజూ కోట్లాది మంది అక్కడికి వస్తున్నారు. కుంభమేళాను కోట్లాది మంది సందర్శిస్తుండటంతో, అవసరమైన అవసరాలు పెరిగాయి. నీరు, ఆహారం వంటి వస్తువులను అమ్మే విక్రేతలు వేలల్లో సంపాదిస్తున్నారు. కానీ, ఓ యువకుడు మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేస్తూ జస్ట్ గంటకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి గురించిన విశేషాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Business Idia: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు కుంభమేళా ప్రాంతంలో సెల్ ఫోన్స్ ఛార్జ్ చేస్తున్నాడు. అతను ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం నిండిపోయింది. ఒకసారి 25 ఫోన్లను ఛార్జ్ చేయగలిగేలా బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. గంట సేపు ఛార్జ్ చేయడానికి 50 రూపాయలు తీసుకున్తున్నాడు. అంటే గంటలో 25 ఫోన్లకు ఛార్జ్ చేస్తే 1000 రూపాయలు అతనికి వస్తాయి. అక్కడకు వచ్చిన ప్రజల్లో దాదాపుగా అందరికీ సెల్ ఫోన్ ఛార్జింగ్ అవసరం అవుతుంది. ఈ డిమాండ్ లెక్క చూస్తే కనీసం రోజులో 18 గంటల పాటు ఆ యువకుడు విరామం లేకుండా సర్వీస్ అందించగలుగుతాడు. అంటే రోజుకు (18 గంటలే లెక్క వేస్తే ) దాదాపు 18 వేల రూపాయలు. ఒక సాధారణ వ్యక్తి నెల జీతం ఒక్కరోజులో ఈ వ్యక్తి సంపాదిస్తున్నాడు. ఆఫ్ కోర్స్ ఇది 45 రోజుల పని మాత్రమే కావచ్చు. కానీ, జస్ట్ చిన్న ఐడియాతో ఈ 45 రోజుల్లో కనీసంగా చూసుకున్నా 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదించగలడు.
Business Idia: ఇంటర్నెట్ లో ఇతని వీడియోకు మంచి స్పందన వస్తోంది. అందరూ అతన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే, దూరాభారాల నుంచి అక్కడకు వచ్చినవారు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎంతో ఇబ్బంది పడతారు. తమ కుటుంబీకులకు తమ యోగక్షేమాలు తెలియచేసే మార్గం లేక బాధ పడతారు. అక్కడ గంట ఛార్జింగ్ అవకాశం అంటే అది అటువంటి వారి నెత్తిన పాలు పోసినట్టే. అందులోను జనం అవసరాలను అతను దోచుకోవడం లేదు. అటువంటి చోట గంటకు 100 రూపాయలు అని చెప్పినా డిమాండ్ తగ్గదు. గంటకు 50 రూపాయలు ఛార్జింగ్ కోసం అనేది చాలా రీజనబుల్ అని నెట్టింట్లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.