Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్లోకి అడుగు పెడుతుంది. శ్రీదేవి అంటే తమిళ్ ప్రేక్షకుల్లో ఇప్పటికీ చాలా అభిమానం ఉంది. అందుకే చాలా కాలంగా జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ కోసం శ్రీదేవి అభిమానులు, తమిళ్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ అక్కడి ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్ చేసేది ఒక వెబ్ సిరీస్. జాన్వీ కపూర్ పై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించి కోలీవుడ్‌లో ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం విభిన్నమైన వెబ్ సిరీస్‌తో తమిళ్ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతుంది.అది కూడా పా రంజిత్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ వెబ్ సిరీస్ రూపొందబోతుంది. అణచివేతకు గురి కాబడ్డ ఒక తెగ గురించిన కథతో పా రంజిత్ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారు. ఇందులోని ముఖ్య పాత్ర కోసం జాన్వీ కపూర్‌ను సంప్రదించారని, అందుకు ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది.

