హైదరాబాద్ లో దారుణం జరిగింది. యువతపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి సోమవారం అర్ధరాత్రి ఇంటికి వెళ్దామని ఆర్సిపురం వద్ద ఆటో ఎక్కింది.మసీద్‌బండ ఏరియాకు రాగానే ఆటో డ్రైవర్ ఆ యువతపై లైంగిక దాడి పాల్పడ్డాడు.
ఏం చేయాలో అర్థం కాక ఆ యువతి బిక్కుబిక్కు అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. ఘటన స్థలానికి వెళ్లి క్లూస్ కోసం వెతికారు. నిందితుడిని తొందరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
కాగా, కోల్ కత్తా లో జరిగిన డాక్టర్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచాలను సృష్టించిన సంగతి తెలిసిందే. అది మరువకముందే హైదరాబాద్ లో మరో ఘటన జరగడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. దీనిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

