ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025: ట్రై సిరీస్ ఫైనల్స్ లో పాకిస్తాన్..! శతక్కొట్టిన సల్మాన్, రిజ్వాన్

ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు జరుగుతున్న నిర్ణయాత్మక ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆతిథ్య పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుతంగా ప్రదర్శించింది. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా తమ అద్భుతమైన శతకాలతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా 96 బంతుల్లో 82 పరుగులతో 13 ఫోర్లతో, యువ ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్‌కీ 84 బంతుల్లో 83 పరుగులతో 10 ఫోర్లు, ఒక సిక్స్, హెన్రీచ్ క్లాసెన్ 56 బంతుల్లో 87 పరుగులతో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో రాణించారు. చివరిలో కైల్ వెర్రెయిన్ 32 బంతుల్లో 44 పరుగులతో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లతో 66 పరుగులు ఇచ్చాడు, నసీమ్ షా, కుష్‌దిల్ షా ఒక్కో వికెట్ తీశారు.

తరువాత పాకిస్థాన్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 355 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 128 బంతుల్లో 122 పరుగులతో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో నాటౌట్‌గా, సల్మాన్ అఘా 103 బంతుల్లో 134 పరుగులతో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా ఉన్నారు.

Also Read: Telangana Secretariat: సెక్ర‌టేరియ‌ట్‌లో న‌కిలీ ఐఏఎస్ హ‌ల్‌చ‌ల్‌.. మ‌రో ఇద్ద‌రు అటెండ‌ర్లు.. అస‌లేం జ‌రుగుతోంది?

మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ 23 పరుగులు, సౌద్ షకీల్ 15 పరుగులతో నిరాశపర్చగా, ఫకార్ జమాన్ 41 పరుగులతో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్ 2 వికెట్లతో 79 పరుగులు ఇచ్చాడు, కోర్బిన్ బోస్చ్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో పాకిస్థాన్ శుక్రవారం జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పాకిస్థాన్ సొంతగడ్డపై ముక్కోణపు వన్డే సిరీస్ నిర్వహించింది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 6 వికెట్ల తేడాతో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరింది. దీంతో సౌతాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్ సెమీఫైనల్‌లా మారింది. ఫైనల్‌కు చేరే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి కానీ పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా బౌలర్లు పాకిస్తాన్ ముందు తడబడ్డారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *