IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. చివరి వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. రెండు మ్యాచ్‌ల్లో భారత్ 249, 305 పరుగులను ఛేదించింది. మూడో వన్డేలో గెలుపు కోసం ఇంగ్లాండ్ ఆశావహంగా ఉంది. ఈ విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఘనంగా ప్రవేశించాలని చూస్తోంది.
మూడో వన్డేలో టీమిండియా మూడు మార్పులు చేయవచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి మ్యాచ్ కావడంతో కీలకమైన మార్పులతో బరిలోకి దిగనుంది. అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా తన బెంచ్ బలాన్ని నిరూపించింది. మూడో వన్డేలో మూడు మార్పులు చేసి ఆడే అవకాశముంది. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లో ఉన్నాడు. కానీ, రెండో వన్డేలో వరుణ్ చక్రవర్తి అతని స్థానంలో వచ్చాడు.
Also Read: Road Accident: మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా విషాదం.. ఏడుగురు తెలుగు భక్తుల దుర్మరణం
2024లో న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్ట్ కు కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. ఆ తర్వాత నాగ్‌పూర్ వన్డేలో తిరిగి ఆడాడు. ఈ క్రమంలో, చివరి వన్డేలో కుల్దీప్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షిత్ రాణా మొదటి రెండు వన్డేల్లో ఆడాడు. అయితే, హర్షిత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. కానీ, అర్ష్‌దీప్‌ను జట్టులో ఉంచారు.
అర్ష్‌దీప్ సింగ్ పవర్ ప్లే లో స్వింగ్‌తో అద్భుతంగా రాణిస్తాడు. డెత్ ఓవర్లలో నెమ్మదిగా బంతులు వేయడంలో కూడా దిట్ట. ఇక మూడవ వన్డేలో అతనికి అవకాశం లభించే అవకాశం ఉంది. రిషబ్ పంత్‌కు ఇప్పటివరకు రెండు వన్డేల్లోనూ అవకాశం లేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించారు. మూడో వన్డేలో పంత్‌ను రాహుల్ స్థానంలో ఆడించవచ్చు..!

