Periods Problems

Periods Problems: ఇర్రెగ్యులర్ పీరియడ్స్.. ఇంట్లోనే పరిష్కారం

Periods Problems: క్రమరహిత పీరియడ్స్ చాలా మంది మహిళలను వేధిస్తోంది. దీనివలన మహిళలు నిరాశకు, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ప్రతి స్త్రీ ఋతు చక్రం భిన్నంగా ఉంటుంది. 21 రోజుల నుండి 28 రోజులలోపు పీరియడ్స్ సాధారణం. గర్భవతిగా ఉన్నప్పుడు పీరియడ్స్ రావు. ఇది మహిళలందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం ప్రెగ్నెన్సీ కారణంగానే కాదు, ఇతర కారణాల వల్ల కూడా స్త్రీలకు రుతుక్రమం తప్పుతుంది. పిరియడ్స్ సక్రమంగా రాకపోవటానికి అది ఒత్తిడి కావచ్చు, హార్మోన్లు కావచ్చులేదా మరేదైనా కారణం కావచ్చు. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పరిష్కారం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రమరహిత పీరియడ్స్‌కు దాల్చినచెక్క బెస్ట్ రెమెడీ. ఒక గ్లాసు పాలలో కొద్దిగా దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల నెలసరి సక్రమంగా రావడానికి చాలా మంచిది.

క్యారెట్ జ్యూస్, ద్రాక్ష రసం ఋతుక్రమం సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. ఋతుక్రమం సక్రమంగా జరగాలంటే యోగా, వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ రెండు గంటల పాటు యోగా చేయడానికి ప్రయత్నించండి.

ఇది కూడా చదవండి: Beauty Tips: బీట్‌రూట్ ఉంటే… బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు!

బొప్పాయి ఋతుక్రమం సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

రుతుక్రమం సక్రమంగా జరగాలంటే పసుపు కలిపిన పాలను తాగాలి. పసుపును రెగ్యులర్ గా తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.

అల్లంను మెత్తగా పేస్ట్‌గా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి తింటే రుతుక్రమానికి చాలా మంచిది . బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *