Zombie Reddy Sequel: గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన “హను మాన్” సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కానీ రీతిలో ఈ సినిమా ఏకంగా 350 కోట్ల దాకా వసూళ్ళని సాధించింది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా అదరగొట్టింది. మరి ఈ సినిమాకి గ్రాండ్ సీక్వెల్ గా “జై హనుమాన్” ని కూడా ప్రస్తుతం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా తాజాగా ఈ సీక్వెల్ కాకుండా ఇదే కాంబినేషన్ నుంచి మరో క్రేజీ సీక్వెల్ వస్తుందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ సినిమా “జాంబీ రెడ్డి” ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు అయింది. అయితే దీనికి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జలు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తేజ చేసిన సస్పెన్స్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. దీనితో ఈ సినిమా సీక్వెల్ పై కూడా నెట్టింటా ఆసక్తి పెరిగింది.
