Daggubati Venkatesh

Daggubati Venkatesh: రూ. 300 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు సీనియర్ హీరో!

Daggubati Venkatesh: టాలీవుడ్ లో తెలుగు సీనియర్ హీరోలంటే… నాలుగురే! చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌. విశేషం ఏమంటే… ఈ నలుగురిలో రేర్ రికార్డ్ ను చివరి వారైన విక్టరీ వెంకటేశ్ సొంతం చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పొంగల్ విజేతగా నిలవడమే కాదు… సీనియర్ హీరోల సినిమాల కలెక్షన్స్ లోనే ఓ నయా రికార్డ్ ను నమోదు చేసింది. భీమ్స్ సంగీతం సమకూర్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *