Eluru: మద్యం మానుకోవాలని భార్య చెప్పిన మాటలు తలకెక్కించుకోలేదు. పైగా ఆమెపై కోపం పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి భర్త మద్యం మత్తులో భార్యను కత్తితో నరికి దారుణంగా చంపాడు..ఈ ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
మఠంగూడెం గ్రామానికి చెందిన జక్కంపూడి మారేశ్వరరావు అనే వ్యక్తి కామవరపుకోట మండలం కళ్ల చెరువు గ్రామానికి చెందిన నాగమణిని వివాహం చేసుకున్నాడు.. వీరికి ఇద్దరు సంతానం.. మారేశ్వరరావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఏ పనులు చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. భార్య నాగమణి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
గత కొంతకాలం నుంచి మారేశ్వరరావు మతి స్థిమితం సరిగా ఉండటం లేదంటూ స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వీరి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి భర్త మద్యం మత్తులో భార్యను కత్తితో నరికి దారుణంగా చంపాడు..విషయం తెలుసుకున్న ధర్మాజిగూడెం పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

