Husband Suicide: కాలం మారింది.. భర్తల వేధింపుల కథలు ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భార్యల వేధింపులు భరించలేక భర్తలు చచ్చిపోతున్నారు. అవును మొన్నటికి మొన్న కర్ణాటకలో ఓ ఐటీ ఇంజినీర్ తన భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తోందంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. ఇంకా ఆ వైబ్ నుంచి బయటకు రాకుండానే కర్ణాటకలో మరో భార్యాబాధితుడి కథ వెలుగులోకి వచ్చింది. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా కర్ణాటకలో కలకలం రేపింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
హుబ్బళ్లి చాముండేశ్వరికి చెందిన పేటరు గోలపల్లి (40). ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన తరువాత కొన్నిరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిద్దరి జీవితం సాఫీగా సాగింది. పేటారు గొలపల్లి కొంతకాలం క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం లేక పోవడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో అతని భార్య పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు పెండింగ్ లో ఉంది. దీంతో తన భార్యను విడాకులు తీసుకుందామని అడిగాడు గోలపల్లి.
ఇది కూడా చదవండి: Gas cylinder Explosion: వంట చేస్తుండగా..పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి
దానికి ఆమె అంగీకరించలేదు. పైగా కేసు వాపసు తీసుకోవాలంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని.. లేకపోతే మరో కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఏమి చేయాలో తెలియక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెటరు గొలపల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన అతని సోదరుడు యేసయ్య తిరిగి వచ్చేసరికి మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి షాక్‌కు గురయ్యాడు.
ఆత్మహత్యకు ముందు పెటరు గొలపల్లి రాసిన లేఖ కూడా సోదరుడికి లభించింది. అందులో, నన్ను క్షమించు, ఆమె (భార్య) నన్ను చంపుతోందని రాసాడు. అంతేకాకుండా డాడీ నా భార్య నా చావు కోరుకుంటుంది” అని రాశాడు.
సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని సోదరుడు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

