Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతిలోంచి ఓ మూవీ చేజారినట్టు తెలుస్తోంది. గత యేడాది ఆగస్ట్ 15న విశ్వక్ సేన్ హీరోగా సుధాకర్ చెరుకూరి ఓ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రంలో నటించిన సంపద ఈ చిత్రంలో హీరోయిన్. శ్రీధర్ గంటా దర్శకుడు. హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్ సేన్ నటించబోతున్నాడని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇదని మేకర్స్ అప్పట్లో చెప్పారు. దీనికి ‘బందూక్’ అనే వర్కింట్ టైటిల్ కూడా అనుకున్నారట. అయితే… ఇప్పుడా సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. మూవీ షెడ్యూల్స్ పలు మార్లు వాయిదా పడటం, కొత్త దర్శకుడి మీద విశ్వక్ సేన్ కు గురి లేకపోవడం కారణం కావచ్చునని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేరే హీరోతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సుధాకర్ చెరుకూరి ప్రయత్నాలు చేస్తున్నారట. గత యేడాది విశ్వక్ సేన్ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా, ఈ యేడాది వాలెంటైన్స్ డే కానుకగా ‘లైలా’ మూవీ రిలీజ్ కాబోతోంది. అలానే విశ్వక్ సేన్ కమిట్ అయిన మరి కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్థంగా ఉన్నాయి.
