కెనరా బ్యాంక్(canara bank) వినియోగదారులకు షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితితో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై వడ్డీరేట్లు అధికం కానున్నాయి. వడ్డీరేటు సుమారు 9 శాతం నుంచి 9.05 శాతానికి పెరగనుంది.
ఇక నెల, మూడు, ఆరు నెలల కాల పరిమితితో తీసుకునే లోన్స్ పై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.85 శాతం వరకు పెరగనున్నాయి.పెరిగిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమలు లోకి రానున్నట్లు తెలిపింది. వడ్డీ రేటు పెరగడంతో వినియోగదారులకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఒకేసారి 0.5 శాతం పెర్గడంతో లోన్స్ తీసుకున్న వారు ఆలోచనచేయాల్సి వస్తుంది.