Sakshi Mhadolkar: ప్రముఖ వ్యాఖ్యత సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ పూర్తి స్థాయి హీరోగా ‘బబుల్ గమ్’ మూవీలో నటించాడు. అతని రెండో సినిమా ‘మోగ్లీ’. రచయిత, నటుడు, దర్శకుడు, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీ లవ్ స్టోరీగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమా ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. త్రిశూలం పట్టుకొని ఆదిశక్తిగా సాక్షి కనిపించే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె జాస్మిన్ అనే పాత్రను పోషిస్తోంది. ఇదే యేడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. విశేషం ఏమంటే… రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్ గమ్’తోనూ కొత్త అమ్మాయి మానసా చౌదరి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.