KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నిరాశే ఎదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 8న క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ దశలో హైకోర్టు ఆదేశాలను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ.. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేయడం గమనార్హం.
KTR: ఈ నేపథ్యంలో బుధవారం కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 13(1) కేటీఆర్‌పై వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. నిర్వహణ సంస్థకు డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతుందని వాదన వినిపించారు. రూ.54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో కేటీఆర్‌కు నిరాశే మిగలడంతో తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.