sankranthiki vasthunnam twitter review

Sankranthiki Vasthunnam Twitter Review: వెంకీ “సంక్రాంతికి వస్తున్నాం”.. ఎలా ఉందంటున్నారు?

Sankranthiki Vasthunnam Twitter Review: సంక్రాంతి పండుగ అంటే రంగుల ముగ్గులు.. కోడి పందాలు.. కొత్త అల్లుళ్ళు మాత్రమే కాదు.. కొత్త సినిమాలు కూడా. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల ప్రజల సంప్రదాయాల ఒరవడిలో సినిమా కూడా భాగం అయిపొయింది. అందుకే నిర్మాతలు సంక్రాంతి స్లాట్ కోసం పోటీ పడుతుంటారు. హీరోలు సంక్రాంతికి తమ సినిమా పడాలని కోరుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు సందడి చేస్తాయి. అయితే.. వాటిలో ఏదో ఒక్క సినిమా మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. సంక్రాతి బొమ్మగా నిలబడుతుంది. ఇదిగో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి మూడు సినిమాలు వరుస కట్టాయి. లాస్ట్ లో వచ్చినా లీస్ట్ గా మాత్రం ఉండదు అంటూ సంక్రాంతి రోజు దిల్ రాజు నిర్మించిన అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో “సంక్రాంతికి వస్తున్నాం” వచ్చేసింది. 

Sankranthiki Vasthunnam Twitter Review: ఈసినిమాపై విపరీతమైన బజ్ ఉంది. సాఫ్ట్ టైటిల్.. కుటుంబ కథా చిత్రంగా జరిగిన ప్రచారం.. వెంకటేష్ మార్క్ కామెడీ కనిపించిన ట్రైలర్స్.. అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ అన్నీ కల్సి ఇటు రామ్ చరణ్ సినిమా, అటు బాలయ్య బాబు సినిమాలు ఉన్నప్పటికీ కచ్చితంగా చూడాల్సిన సినిమాగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం రెడీ  అయిపోయారు. ఇప్పటికే సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. ట్విట్టర్ లో రివ్యూలు మొదలైపోయాయి. సోషల్ మీడియాలో సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Sankranthiki Vasthunnam Twitter Review: ట్విట్టర్ లో చాలామంది చెబుతున్నదాని ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైమ్ పాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. లాజిక్ లేకుండా కామెడీతో మేజిక్ చేశారని ట్విట్టర్ లో నెటిజన్లు చెబుతున్నారు. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించడమే టార్గెట్ అన్నట్టు అనిల్ రావిపూడి ఈ సినిమాని రెడీ చేశారని అంటున్నారు. 

Sankranthiki Vasthunnam Twitter Review: వెంకటేష్ కి టైలర్ మేడ్ రోల్ లా వైడీ రాజు క్యారెక్టర్ సూటయింది అంటున్నారు. వెంకీ కామెడీ టైమింగ్.. పంచ్ డైలాగ్స్ మళ్ళీ మల్లేశ్వరిని గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా సంక్రాంతికి సకుటుంబ సపరివారంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని మెజార్టీ సోషల్ మీడియా పోస్ట్ లు చెబుతున్నాయి. 

సోషల్ మీడియా X లో సినిమాపై వచ్చిన కొన్ని పోస్ట్ లు ఇక్కడ ఉన్నాయి.. మీరే చూసేయండి. అన్నట్టు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూర్తి రివ్యూ మరి కొద్ది గంటల్లో తెలుసుకోవచ్చు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *