Ajwain leaves

Ajwain leaves: పిచ్చి మొక్కలు అని బయట పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే మతి పోతుంది

Ajwain leaves: ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను అందించాయి. మనం పిచ్చి మొక్కలుగా భావించేవి కూడా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇలాంటి ఆకుల్లో వాము ఆకులు ఒకటి. సాధారణంగా మనం వామును ఉపయోగిస్తుంటాం కానీ వాము ఆకులను మాత్రం పెద్దగా పట్టించుకోం. అయితే వాము ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాము ఆకులతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • వాము ఆకులను క్రమంతప్పకుండా తీసుకోవడం గ్యాస్, అజీర్ణం, అల్సర్‌ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.వాము ఆకులు జీవక్రియ రేటను పెంచడంతో కీలకపాత్ర పోషిస్తాయి.
  • బరువు తగ్గాలనుకునే వారు వాము ఆకులను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవచ్చు. శరీరంలో కొవ్వు కరిగించడంలో వాము ఆకులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • వాము ఆకుట్లో యాంటీ ఆక్సెడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.
  • ఆస్తమా, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్న వారు వాము ఆకులను తిన్నాడని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మ సమస్యలతో బాధపడేవారికి వాము ఆకులు బాగా ఉపయోగపడుతుంది. వీటివల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వాము ఆకులను నూనెలో కలుపుకొని తలకు మర్ధన చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
  • వాము ఆకులను తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించడంలో వాము ఆకులు ఉపయోగపడతాయి.
  • రోజు వాము ఆకులను తీసుకోడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, అల్సర్‌ వంటి సమస్యలు తొలగిపోతాయి.

గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Winter Bath Tips: చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా ఐతే జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *