CM Revanth Reddy: గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వివాదం వైల్డ్ ఫైర్ గా మారుతుంది. తాజాగా ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు విద్యార్థులు సంఘం నేతలు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. “సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి”. అని ఎక్స్ వేదికగా తెలిపారు.
అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ రాకుండా ఉంటే రేవతి అనే మహిళ ప్రాణాలు బతికేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.