Manchu Manoj

Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు ఎంట్రీ.. జనసేన లో చేరుతున్నారు

Manchu Manoj: ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో దివంగత భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డిలకు మంచి పట్టు ఉంది. వీరిద్దరి మరణాంతరం రాజకీయ వారసత్వాన్ని భూమా అఖిలప్రియ తీసుకున్నారు. ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక కూడా రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

గతంలో నంద్యాల ఎన్నికల్లో భూమా మౌనిక తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు.
ఆ అనుభవంతో ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాలకు దూరమైన ఆమె…

ఇది కూడా చదవండి: 52 Kg Gold In Car: మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో కారులో భారీ మొత్తంలో నగదు, బంగారం లభ్యం

Manchu Manoj: ఇప్పుడు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అక్క భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేస్తారని ప్రచారం జోరు అందుకుంది.

Manchu Manoj: నిన్న భూమా శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు భూమా మౌనిక, మనోజ్ దంపతులు వచ్చి ఆళ్లగడ్డలో కీలక ప్రకటన చేస్తారని వార్త సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. భూమా ఘాట్‌ నుంచి రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారన్న ఉత్కంఠ అటు పొలిటికల్ సర్కిల్స్ ఇటు సినీ రంగంలో కూడా ఆసక్తిగా మారింది.
అయితే మంచు మనోజ్ దంపతులు భూమా శోభనాగిరెడ్డికి నివాళులర్పించి నేరుగా భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్‌, మౌనిక ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనలో వెళ్తారని ప్రచారం సోషల్ మీడియా కోడై కూసింది.

ఇది కూడా చదవండి: study tips: పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించే సూపర్ చిట్కాలు

Manchu Manoj: భూమా ఫ్యామిలీకి మెగా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో భూమా మౌనిక, మంచు మనోజ్ చేరతారని వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు. అయితే భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నంద్యాల జిల్లా నుంచి పాలిటిక్స్ చేస్తారా లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత వారి అభిప్రాయం తెలుపుతారా అన్నది తెలియాల్సి ఉంది. జనసేన పార్టీ కండువా కప్పుకుంటారా లేదా అన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. ఏది ఏమైనా మంచు మనోజ్, మౌనిక నిర్ణయం ఎలా ఉండబోతోంది..? వాటి ప్రభావం ఏపీ రాజకీయాలతో పాటు ఇటు మంచు, అటు భూమా కుటుంబాలపై ఎలా ఉండబోతుందన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు వారి పొలిటికల్ క్యాలికెజిలేషన్స్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. మరి ఇదంతా నిజమే అనుకున్నా, మంచు మనోజ్ జనసేన వైపు మొగ్గు చూపితే… మంచు, మెగా కుటుంబాల మధ్య ఎలాంటి ప్రకంపనలు ఉండబోతున్నాయన్న సందేహాలు ఇటు మెగా ఫ్యాన్స్ మైండ్స్‌ను సైతం డిస్ట్రబ్ చేస్తున్నట్టు సమాచారం.

ALSO READ  Telangana: 26 నుంచి రాష్ట్రంలో ఆ నాలుగు ప‌థ‌కాలు షురూ

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *