Bus Accident:

Bus Accident: కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. 10 మంది ప్ర‌యాణికుల‌కు గాయాలు

Bus Accident: న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ పట్ట‌ణ స‌మీపంలో అద్దంకి-నార్క‌ట్‌ప‌ల్లి హైవేపై రాత్రి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు గాయాల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నుంచి హైద‌రాబాద్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

Bus Accident: ఒంగోలు నుంచి 35 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరిన బ‌స్సు మిర్యాల‌గూడ స‌మీపంలోని నందిపాడు వ‌ద్ద‌కు రాగానే అదుపు త‌ప్పి రాళ్ల కుప్ప‌ను ఢీకొని బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి గాయాలు కాగా, 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. బాధితుల‌ను మిర్యాల‌గూడ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అతి వేగం, డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉండ‌ట‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా ప్ర‌యాణికులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *