game changer

Game Changer: డల్లాస్ లో ‘గేమ్ ఛేంజర్’ డోప్ ఫుల్ సాంగ్!

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబో ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా’ గీతాలు వచ్చి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వర రచన చేసిన ఈ సినిమా నుండి నాలుగో సింగిల్ కూడా రాబోతోంది. బుధవారం దిల్ రాజు బర్త్ డే సందర్భంగా దీని ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 21న డల్లాస్ లో జరుగుతున్న ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు. ‘డోప్’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తమన్, రోహిణి, పృథ్వీ శ్రుతి రంజనీ ఆలపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *