Mohan Babu:

Mohan Babu: మలుపులు తిరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం

Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. మంచు మోహ‌న్‌బాబు, ఆయ‌న చిన్న కొడుకు మంచు మ‌నోజ్ వివాదంతో పాటు సోద‌రులైన విష్ణు, మ‌నోజ్ గొడ‌వ‌లు సంచ‌ల‌నం రేకెత్తించాయి. ఆ త‌ర్వాత నిన్న మోహ‌న్‌బాబు స‌తీమ‌ణి నిర్మ‌లా మోహ‌న్‌బాబు పోలీసుల‌కు రాసిన లేఖ క‌ల‌క‌లం రేపింది. మంచు విష్ణు తప్పేమీ లేద‌ని, మ‌నోజ్ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని ఆమె త‌న లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో వివాదం కొత్త మ‌లుపు తిరిగింది.

Mohan Babu: ఇప్ప‌టికే పోలీసుల ఆదేశాల మేర‌కు మోహన్‌బాబు త‌న ఆయుధాల‌ను వారికి అప్ప‌గించారు. ఆయ‌న‌పై న‌మోదైన కేసుల్లో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ పోలీసులు నోటీలు జారీ చేశారు. ఆ నోటీసీల‌కు ఈ నెల 24 వ‌ర‌కు గ‌డువు అడిగారు. ఆ గ‌డువు వ‌ర‌కు వేచి చూస్తామ‌ని, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను తాము గౌర‌విస్తామ‌ని రాచ‌కొండ సీపీ సుధీర్‌బాబు బుధ‌వారం తెలిపారు.

Mohan Babu: మంచు మోహ‌న్‌బాబు కుటుంబంపై మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదయ్యాయ‌ని, మోహ‌న్‌బాబు కేసుపై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని, ఈ నెల 24వ‌ర‌కు వేచి చూస్తామ‌ని, అప్ప‌టికీ స్పందించ‌క‌పోతే మ‌ళ్లీ మోహ‌న్‌బాబుకు నోటీసులు జారీ చేస్తామ‌ని రాచ‌కొండ సీపీ చెప్పారు. జ‌ర్న‌లిస్టుల‌పై దాడి కేసులో అనూహ్యంగా దాడికి గురైన జ‌ర్న‌లిస్టు వద్ద‌కు వెళ్లి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం, వారి కుటుంబ స‌భ్యుల‌కు, జ‌ర్న‌లిస్టులకూ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ మోహ‌న్‌బాబు అభ్య‌ర్థించ‌డంపై అనూహ్య మ‌లుపున‌కు దారి తీసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *