America: క్రిస్టియన్ స్కూల్లో కాల్పులు.. ఐదుగురు దుర్మరణం..

America: అమెరికాలో ఘోర కాల్పులు జరిగాయి.విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లోని క్రైస్తవ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో అనుమానిత షూటర్‌తో సహా ఐదుగురు చనిపోయారు.మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.మ‌రో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘ‌ట‌న‌ జరిగినట్లు మాడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో తెలిపింది. ఈ సంఘటనలో కనీసం ఐదుగురు చ‌నిపోయారని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు 12వ త‌ర‌గ‌తి చదువుతున్న ఓ విద్యార్థి కార‌ణ‌మైన‌ట్లు గుర్తించామ‌న్నారు. అలాగే గాయప‌డిన ఐదుగురిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు బర్న్స్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై మాడిస‌న్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.కే-12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెరికాలో ఈ ఏడాది 322 పాఠశాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *