Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన పర్యటనలో, పోలవరం ప్రాజెక్టు పనులను ఎరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుండి పోలవరం డ్యామ్ ను గమనించారు. గ్యాప్-1, గ్యాప్-2 పనులు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కూడా ఆయన సమీక్షించారు.
పర్యటనలో భాగంగా, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా, ప్రాజెక్టు పనుల గురించి అధికారులు, పోలవరం ఇంజినీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమున్న అంశమని ఆయన అధికారులకు వివరించారు. అలాగే, భవిష్యత్తులో చేపట్టాల్సిన నిర్మాణ పనుల షెడ్యూల్ ను ఆయన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు పర్యటనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు
.