Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయి మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌కు పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయనను పరామర్శించారు. అల్లు అర్జున్ను ఆలింగనం చేసుకొని మద్దతు తెలిపారు. మేమున్నాం.. అంటూ సపోర్టుగా నిలిచారు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన వారిలో నాగచైతన్య, ఆర్ నారాయణమూర్తి, సుధీర్‌బాబు, అల్లు బాబీ, సుకుమార్, బ్రహ్మాజీ, కీరవాణి, బీవీఎస్ఎన్ ప్రసాద్, హరీశ్ శంకర్, రానా దగ్గుపాటి, మైత్రీ ప్రొడ్యూసర్ నవీన్, కొరటాల శివ, అవంతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.








