Aadhaar Card:

Aadhaar Card: నేటితో ముగియ‌నున్న ఆధార్ ఉచిత‌ అప్‌డేట్ గ‌డువు

Aadhaar Card: ఆధార్ కార్డు మార్పు విష‌యంలో ఉచితంగా చేసుకునే గ‌డువు ఈ రోజు (శ‌నివారం)తో ముగియ‌నున్న‌ది. ఎలాంటి చార్జీలు చెల్లించ‌కుండా ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది. ఈ నెల 15 నుంచి ఎలాంటి మార్పుకైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు యూఐడీఏఐ గ‌డువు పొడిగించ‌గా, మ‌రోసారి పెంచుతుంద‌ని భావించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Aadhaar Card: ఎవ‌రైనా మార్పులు చేసుకోవాలంటే.. మై ఆధార్ పోర్ట‌ల్‌లో లాగిన్ కావాలి. సంబంధిత‌ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోవ‌చ్చు. అయితే జ‌న‌వ‌రి వ‌ర‌కు మ‌రోమారు పొడిగించే అవ‌కాశం ఉంటుందని స‌మాచారం. కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *