Delhi: మన దేశంలో ఉన్న లెక్క ఇది. ఎంత మంది జనాభాకు ఎంత మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారన్న లెక్క తేలింది. ఏటేటా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతున్నా, విపరీతంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆ సంఖ్య చాలడం లేదు. దీంతో ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ లెక్కను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. న్యాయమూర్తుల ఖాళీల వివరాలను కూడా కేంద్రం వెల్లడి చేసింది.
Delhi: రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘావాల్ న్యాయమూర్తుల వివరాలపై
సమాధానం ఇచ్చారు. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 21 మంది జడ్జీలు ఉన్నారని తేల్చి చెప్పారు. దేశంలోని వివిధ హైకోర్టులలోనే 368 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 పోస్లులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్టు మంత్రి మేఘావాల్ వివరించారు.

