Hyderabad: ఏంటీ దారుణం.. భార్యను కొడుకును చంపి సూసైడ్ చేసుకున్న భర్త

Hyderabad: హైదరాబాద్ లో దారుణం జరిగింది. బేగంబజార్‌లో ఉత్తరప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన సిరాజ్ అలీ, తన భార్య హేలియా కుమారుడు హైజాన్‌ను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో, సిరాజ్ తన భార్య హేలియాను గొంతు కోసి చంపిన తర్వాత, కుమారుడైన హైజాన్‌ను కూడా గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం, సిరాజ్ అలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ దారుణాన్ని చూసిన అతని పెద్ద కుమారుడు భయంతో ఇంటినుంచి పారిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానకు తరలించారు.

పోలీసులు.. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని అనుమానిస్తున్నారు. సిరాజ్ రాసిన సూసైడ్ నోటును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  mp aravind: బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్‌కు స్పష్టత లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *