Sleeping Tips:మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. అలసిపోయిన శరీరాన్ని రిఫ్రెష్‌గా, శక్తివంతంగా ఉంచడానికి నిద్ర ఎంతో మేలు చేస్తుంది. అయితే హాయిగా , ప్రశాంతంగా నిద్రించడానికి చాలా మంది దిండును ఉపయోగిస్తారు. కానీ దిండు లేకుండా నిద్రపోవడం చాలా బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దిండు లేకుండా పడుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట.. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తక్కువ వెన్నునొప్పి : వెన్నునొప్పి అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి చాలా కారణాలున్నాయి. కానీ వెన్ను నొప్పి ఉన్నవాళ్లు దిండును ఉపయోగించకూడదు. దిండు లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉంటుంది. అందువలన నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి:NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.
తక్కువ మెడ నొప్పి : మెడ నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. మెడ నొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు. దిండు లేకుండా పడుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. మెడ, చేతికి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అందువలన నొప్పి తగ్గుతుంది.
చర్మం, జుట్టు : దిండుతో పడుకోవడం వల్ల జుట్టు, చర్మం దెబ్బతింటాయి. దిండు వాడేవారికి జుట్టు, చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.. దిండు లేకుండా నిద్రపోతే ఈ సమస్యల నుంచి బయటపడతారు.
తక్కువ తలనొప్పి : కొంతమందికి ఉదయం లేవగానే తలనొప్పి వస్తుంది. దీనికి కారణం దిండు అంటున్నారు నిపుణులు. ఎత్తైన దిండు తలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. దిండు లేకుండా నిద్రపోతే ఈ సమస్య దరిచేరదు. దిండు పెట్టుకుని పడుకుంటే మెడ వంగిపోతుంది. దిండు లేకుండా నిద్రపోతే మెడ నిటారుగా ఉంటుంది.
Sleeping Tips: బాగా నిద్రపోండి కొందరైతే దిండు ఉంటేనే నిద్ర బాగా పడుతుందని చెప్తారు. కానీ చాలా సమస్యలు దిండు వల్లే వస్తాయి. ఇక దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. తక్కువ ఒత్తిడి, మంచి నిద్ర పడుతుంది.