Dussehra 2024 ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇచ్చారు. భక్తులకు ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అవకాశం కల్పించారు. భక్త జన సందోహంతో ఇంద్ర కీలాద్రి కిక్కిరిసిపోయింది రాత్రి 11 గంటల వరకూ 70 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు చెప్పారు. ఈరోజు దుర్గమ్మకు ఒక పేరు చెప్పని భక్తుడు రెండున్నర కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటం, ఆభరణాలను సమర్పించారు. బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని హోమ్ మంత్రి వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధితో పాటు పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.
ఈరోజు శ్రీగాయత్రీ దేవిగా..
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు దుర్గమ్మవారు శ్రీగాయత్రి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.