Madhyapradesh: ఈ మధ్యకాలం పిల్లలు గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసి వాటికి బాగా అలవాటు పడినట్లు తయారవుతున్నారు. చేతిలో ఒక గన్ను ఉంటే ఎవరినైనా కాల్చేయవచ్చు పని భావిస్తున్నారేమో మరి. మధ్యప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని చాతార్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి.. స్కూల్ ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపాడు. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న గన్‌తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన ఆ స్టూడెంట్.. ప్రిన్సిపాల్ స్కూటర్‌పై పరారీ అయ్యాడు. కానీ అతన్ని తర్వాత పట్టుకున్నారు.