Dil Raju: తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా ఆయనని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతకంతో ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయనున్నారు అన్ని వార్తలు వచ్చాయి. కానీ అయన నేరుగా ఎన్నికలో పోటీచేయలేదు. కాగా దిల్ రాజు తన వొంతు సాయం కాంగ్రెస్ పార్టీ కి చేశారు అని నివేదికలు సూచించాయి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దిల్ రాజుకు ఈ కీలక బాధ్యతను అప్పగించారు.
ఇది కూడా చదవండి: Nayanthara: ‘రాజా సాబ్’ సరసన నయన్!
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో ‘పెళ్లి పందిరి’ సినిమాలో పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించారు. ఇపుడు అయన టాలీవుడ్ అగ్ర నిర్మలతోలో ఒక్కడిగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ అనే సినిమాతో నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా విజయం సాధించడంతో పాటు మంచి పేరుకూడా తెచ్చిపెటింది అప్పటినుంచి వెంకటరమణారెడ్డి వున్నా తన పేరుని దిల్ రాజు గా మార్చుకున్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/Fh0AN3pt4c
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024