Samantha vs Surekha: మంత్రి కొండా సురేఖ ఈరోజు (అక్టోబర్ 2) కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఆమె నాగ చైతన్య – సమంత విడాకుల విషయాన్ని కూడా ప్రస్తావించారు . దీనికి కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు . ఇక్కడితో ఇది ఆగిపోలేదు . ప్రకాష్ రాజ్ కూడా మంత్రి కొండా సురేఖను తప్పు పడుతూ విమర్శలకు దిగారు . ఇక అక్కినేని నాగార్జున కూడా ఈ విషయంపై స్పందించారు . తమ కుటుంబాన్ని ఇలా రాజకీయాల్లో వాడుకోవద్దంటూ కోరారు . ఇవన్నీ పక్కన పెడితే , తాజాగా నటి సమంత కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై తన అసంతృప్తిని వెల్లడించారు. ఈమేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు .
Samantha vs Surekha: సమంత తన ప్రకటనలో “నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.” అంటూ పేర్కొన్నారు . అంతేకాకుండా , ” స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి….చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను- దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను.” సమంత సుతి మెత్తగా మంత్రి సురేఖకు తన అభ్యంతరాన్ని తెలియచేశారు .
Samantha vs Surekha: “వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా.. గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను” అంటూ సమంత మంత్రికి చెప్పారు . నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేశారు . ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదా ప్రమేయం లేదు అని విస్పష్టంగా పేర్కొన్నారు . తానెప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాననీ . . అలాగే ఉండాలని కోరుకుంటానని చెప్పారు . దయచేసి తన పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచాలని సమంత మంత్రి సురేఖను కోరారు .


