congress: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌పూర్‌కు వెళ్లకుండా బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. సంభాల్‌లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ దశలో అక్కడి బాధితులను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతలరు అక్కడికి వెళ్లడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద వారి వాహనాలను యూపీ పోలీసులు నిలిపేశారు.
congress: సంభాల్ పర్యటనకు రాహుల్, ప్రియాంకలు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచే ఢిల్లీ సరిహద్దులో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నేతలు అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో పోలీసులు వారిని నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కిలోమీటర్ల కొద్ది వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

