Pushpa 2-RGV

Pushpa 2-RGV: పుష్ప 2 = రెండిడ్లీ.. రామ్ గోపాల్ వర్మ లెక్క తగ్గేదేలే!

Pushpa 2-RGV: సినిమా అంటే వినోదం. ఇల్లు, తిండి, బట్ట కంటే వినోదం ఎక్కువా? ఈ మూడు కాకుండా వినోదం కూడా నిత్యావసరమే అనుకుంటే.. బ్రాండెడ్  బట్టలకు.. సెవన్ స్టార్ హోటల్ లో టిఫిన్ రేట్లకు.. లగ్జరీ ఇళ్లకూ ఉన్న రేట్లతో పోలిస్తే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు ఎక్కువేమీ కాదు అంటూ తనదైన స్టైల్ లో పుష్ప 2 సినిమా టికెట్ల ధరలపై వ్యాఖ్యానించారు రామ్ గోపాల్ వర్మ. తన సమర్ధన కోసం ఓ పిట్టా కథను కూడా చెబుతున్నారు. కథలు చెప్పడంలో ఆర్జీవీని మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే కదా. 

Pushpa 2-RGV: సుబ్బారావు ఇడ్లీ 1000 రూపాయలు. దానిని కొనడానికి ఎగబడ్డారు జనాలు. ఎందుకంటే, దాని క్వాలిటీ అలాంటిది. అదే క్వాలిటీ లేకపోతే  దాని జోలికే పోరు. అలాగే సినిమా కూడా. అయినా.. అంత ధర పెట్టి టికెట్ కొనలేనపుడు రేట్లు తగ్గాకా చూడొచ్చు కదా అని కూడా ఆర్జీవీ తనదైన భాష్యం చెబుతున్నారు.

Pushpa 2-RGV: ఇక్కడ ఒకసారి ఆయన ట్వీట్ లో ఏమన్నారో యధాతథంగా చూడండి.. 

Pushpa 2-RGV: పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2 సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Rishab Shetty: ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’గా రిషభ్ శెట్టి!

Pushpa 2-RGV: అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!

ALSO READ  Dowry Harassment: 100 సావర్ల బంగారం, 70 లక్షల కారు కొనిచ్చిన మళ్లీ వరకట్న వేధింపులు.. మహిళ మృతి

ఇదీ ఆయన చెప్పిన ఫుల్ స్టోరీ. కాబట్టి ఆర్జీవీ చెప్పిన కథలోనూ నిజం ఉంది. సినిమా బావుంటేనే అందరూ చూస్తారు.  అంత రేట్లు అని అనే బదులు సినిమా రేట్లు తగ్గాకే చూడొచ్చుగా అని ఆయన అంటున్న మాట కూడా నిజమే కదా. అయినా ఆర్జీవీ ఎప్పుడూ నిజమే చెబుతారు కదా. 

Pushpa 2-RGV: తనమీద ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి కాస్త రిలాక్సేషన్ కోర్టు ఇచ్చింది. దీంతో ఆర్జీవీ మళ్ళీ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. సరిగ్గా ఇప్పుడు పుష్ప 2 విడుదల అవుతోంది. అసలే మెగా ఫ్యాన్స్ రెండుగా చీలినట్టు కనిపిస్తున్న పరిస్థితి. ఇంకేముంది.. పవన్ కళ్యాణ్ ను ఎవరు వ్యతిరేకించినా.. వాళ్ళు ఆర్జీవీకి ప్రియమైన వారు అయిపోతారు. అదే కోణంలో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 కు ప్రమోషన్ వాయిస్ గా మారిపోయినట్టు కనిపిస్తోందని ఆర్జీవీ అభిమానులు అనుకుంటున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *