Azaad: అజయ్ దేవ్ గన్ మేనల్లుడు ఆమన్ దేవగన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఆజాద్’. అలానే ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా టాండన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. అజయ్ దేవ్ గన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. బ్రిటీష్ ఇండియా నాటి కథతో ‘ఆజాద్’ మూవీ తెరకెక్కింది. తాము ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్ హార్స్ మిస్ అయిన నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో గుర్రాలకు ట్రైనింగ్ వ్యక్తిగా అజయ్ దేవ్ గన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో తాజాగా అజయ్ దేవ్ గన్ ఈ సినిమా జనవరి 17న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.
