AP News: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అయన భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు తాజా రాజకీయ పరిణామాల పై చేర్చించే అవకాశం వుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ కావలసి ఉంది. కానీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.

