CPI Ramakrishna: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ మైనింగ్ చేస్తున్నారు అని ఎలాగైనా మైనింగ్‌ని ఆపాలని అందులో కోరారు. ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు, తాగునీరు కలిషితమైపోయాయని లెటర్ లో రాశారు. ఆలా కలుషిత నీళ్లు తాగడంతో ఇప్పటికీ 12 మంది మృతి చెందగా.. అనేక మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. అక్రమ మైనింగ్ గోతుల వల్ల కొండపై నుంచి దిగువ పొలాలకు వర్షపు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి రామకృష్ణ లేఖలో కోరారు.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు
One Reply to “CPI Ramakrishna: గరుగుబిల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలి.. పవన్ కల్యాణ్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ”