తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం tgdsc.aptonline.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. గత సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పదేళ్లలో ఒకేఒక్కసారి టీచర్ నియామకాలు చేశారని చెప్పారు. దసరా లోపు తుది నియామకాలు చేపడతామని వెల్లడించారు.