leopard: ఉత్తరాఖండ్‌లోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారిని చిరుతపులి ఈడ్చుకెళ్లింది. పిల్లలంతా చిన్నారితో ఆడుకుంటున్నారు.అప్పుడు దాడి చేసిన చిరుతపులి చిన్నారిని నోటితో కరుచుకుని పారిపోయింది. చిరుత బారిన పడిన ఆ చిన్నారి మరణించింది. ఇంటి సమీపంలోని పొదల్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
leopard: పూర్వాల్ గ్రామానికి చెందిన అంకిత్ కుమార్ కొడుకుకు మూడేళ్ళ రాజ్ కుమార్ పెరట్లో తన మామ పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇంటి వెనుక చిరుతపులి కూర్చుని ఉండడం అక్కడ పిల్లలు గమనించలేదని, వారితో చిన్నారి ఆడుకుంటోందని తెహ్రీ ఫారెస్ట్ డివిజన్ భిలంగాణ రేంజ్ ఆఫీసర్ ఆశిష్ నౌటియాల్, పుర్వాల్ గ్రామ చీఫ్ సంజయ్ తివారీ తెలిపారు.
చిన్నారి తల్లి మంజుదేవి ఇంట్లో కొడుకు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించింది. తర్వాత ఇరుగుపొరుగు వారు కూడా వెతికినా చిన్నారి కనిపించలేదు. ఇంతలో ఎవరో ఇంటి వెనుక రోడ్డుపై రక్తపు మరకలను గమనించారు. దాన్ని వెంబడించగా అక్కడ ఛిద్రమైన చిన్నారి మృతదేహం కనిపించింది.
అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేసున్నారు.