God Of War: ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సర్ప్రైజ్లు అందనున్నాయి. ఇందులో ఒకటి అందరికీ తెలిసిందే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్-నీల్ మూవీ అఫీషియల్ ఎన్టీఆర్ లుక్. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్‌లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వీరిద్దరి కాంబోలో ఇంకో సినిమా నాగవంశీ ప్లాన్ చేసినా, ఇద్దరి డేట్స్ ఒకేసారి దొరకకపోవడం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అదే ‘’గాడ్ ఆఫ్ వార్’’.. కుమారస్వామి చుట్టూ తిరిగే కథతో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను ఇప్పటికే తయారు చేస్తున్నారు. VFX తో మూవీ టీమ్ సంతృప్తి చెందితే, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ వీడియోను విడుదల చేయనుంది.
చేతులు మారిన గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్.. గాడ్ ఆఫ్ వార్ సినిమా పైన పలుమార్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఒకసారి ఎయిర్ పోర్ట్‌లో ఉన్నప్పుడు ఆయన చేతిలో ‘గాడ్ ఆఫ్ వార్’ బుక్ కనిపించడంతో, అందరూ త్రివిక్రమ్ సినిమా కోసమే ప్రిపేర్ అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. తర్వాత ఇదే స్క్రిప్ట్ అల్లు అర్జున్ చేతులోకి వెళ్లిందని, త్వరలో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ వచ్చింది. కానీ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజుతో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు..

