Horoscope Today

Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి

Horoscope Today:

మేషం (Aries)

మీకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అవసరమైన సమయంలో తోటివారి సహకారం అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

  • పరిహారం: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది.

వృషభం (Taurus)

వృత్తి, ఉద్యోగాల్లో మీరు పెట్టుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

  • పరిహారం: దుర్గాదేవిని ధ్యానించడం శ్రేయస్కరం.

మిథునం (Gemini)

మీ దృష్టిని లక్ష్యం వైపు కేంద్రీకరిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి.వ్యాపార విషయాల్లో సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

  • పరిహారం: నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer)

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.

  • పరిహారం: దుర్గాదేవి దర్శనం మానసిక శాంతిని ఇస్తుంది.

సింహం (Leo)

పనులను వాయిదా వేయకుండా ముందస్తు ప్రణాళికతో సాగండి.సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

  • పరిహారం: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కన్య (Virgo)

పనుల్లో కొంత జాప్యం కలిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు కోసం మరింత కష్టపడాలి.అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

  • పరిహారం: విష్ణుసహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

తుల (Libra)

మీ సంకల్ప బలం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. స్థానచలనం లేదా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి.

  • పరిహారం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio)

ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేయండి. మీ ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. తోటివారి సహకారం లభిస్తుంది.

  • పరిహారం: శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

సహచరుల సహకారంతో పనులు పూర్తవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది, సర్దుకుపోవడం మంచిది.

  • పరిహారం: దుర్గాస్తోత్ర పఠనం మంచిది.

మకరం (Capricorn)

మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే, ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం.

  • పరిహారం: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

కుంభం (Aquarius)

సమాజంలో మీకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

  • పరిహారం: దైవారాధనను కొనసాగించండి.

మీనం (Pisces)

మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది.బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. ఉత్తమమైన భోజన సౌఖ్యం లభిస్తుంది.

  • పరిహారం: ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *